సొసైటీ భూముల సాగు కోసం ప్రత్యేక నిధులు

ABN , First Publish Date - 2021-12-20T04:53:43+05:30 IST

గోపవరం ప్రాజెక్టు ఫార్మింగ్‌ సొసైటీ సభ్యులకు కేటాయించిన భూ ముల సాగు కోసం ప్రత్యేక నిధులు కే టాయించేలా చర్యలు చేపడతామని ఎ మ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ పేర్కొన్నారు.

సొసైటీ భూముల సాగు కోసం ప్రత్యేక నిధులు

గోపవరం, డిసెంబరు 19: గోపవరం ప్రాజెక్టు ఫార్మింగ్‌ సొసైటీ సభ్యులకు కేటాయించిన భూ ముల సాగు కోసం ప్రత్యేక నిధులు కే టాయించేలా చర్యలు చేపడతామని ఎ మ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ పేర్కొన్నారు. ఆదివా రం మండల కార్యాలయ ప్రాంగణలో సొసైటీ సభ్యులకు లాటరీ పద్ధతి ద్వారా భూ ములు కేటాయించిన అనంతరం వారు మాట్లాడుతూ సొసైటీ భూముల్లో ఏర్పాటు చేయనున్న సెంచరీ ప్లేవుడ్‌ ఫ్యాక్టరీ ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు అవకాశముందన్నారు. సొసైటీలోని 200 మంది సభ్యులకు జాతీయ రహదారి పక్కన 50 సెంట్లు భూమి, అదనంగా ఒక్కటిన్నర ఎకరా సాగు భూమిని కేటాయించామని వారు తెలిపారు. కేటాయించిన భూముల ద్వారా సభ్యులకు అన్ని హక్కులు కల్పి స్తామన్నారు. భూములు సాగుచేసేందుకు ప్రభుత్వ సాయం అందిస్తామన్నారు. గ్రా మ సభకు వచ్చిన పలువురు సభ్యులు మాట్లాడుతూ తాము కొన్నేళ్లగా పొలాన్ని సాగు చేసుకుని మామిడి, సపో ట, టేకు, కొబ్బరి చెట్లు పెంచుకున్నామని, పంటలు చేతికొచ్చే దశలో చెట్లు ఉన్నాయని, ఈ పరిస్థితిలో లాటరీ ద్వారా భూములు కేటాయిస్తే తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ స్పందిస్తూ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం చేస్తామన్నారు. అనుడ చైర్మన్‌ సింగసాని గురుమోహన్‌, మార్కెట్‌ యార్డ్‌ వైస్‌చైర్మన్‌ రమణారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, తహసీల్దార్లు రమణారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, ఆర్‌ఐ సతీష్‌, సర్వేయర్‌ శివకుమార్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-20T04:53:43+05:30 IST