శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2021-11-06T05:10:24+05:30 IST

కార్తీకమాసం సందర్భంగా జిల్లాలోని వివిధ శైవక్షేత్రాలను భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఈ నెల 8, 15, 22, 29, తేదీలతో (సోమవారాలు) పాటు కార్తీకపౌర్ణమి రోజైన 18 వతేదీన ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేసిందని ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం కేవీ రమణ పేర్కొన్నారు.

శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం కేవీ రమణ

కడప(మారుతీనగర్‌), నవంబరు 5: కార్తీకమాసం సందర్భంగా జిల్లాలోని వివిధ శైవక్షేత్రాలను భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఈ నెల 8, 15, 22, 29, తేదీలతో (సోమవారాలు) పాటు కార్తీకపౌర్ణమి రోజైన 18 వతేదీన ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేసిందని ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం కేవీ రమణ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఆర్‌ఎం కార్యాలయంలోని తన చాంబర్‌లో విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీటీఎం మాట్లాడారు. పుష్పగిరి, అల్లాడుపల్లె ఆలయాలు, కల్యాణతీర్థం, యాగంటి, మహానంది శైవక్షేత్రాలకు పై తెలిపిన తేదీలలో ఉదయం 5-30 నిమిషాలకు కడప కొత్తబస్టాండు నుంచి బస్సు బయలుదేరి, తిరిగి అదేరోజు రాత్రి 9-30 గంటలకు కడప చేరుతుందన్నారు. ఇందులో పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.275 చార్జి ఉంటుందన్నారు. ప్రతి రోజు శ్రీశైలం క్షేత్రానికి కడప డిపో నుంచి తెల్లవారుజామున 5 గంటలకు, మధ్యాహ్నం 1-30 గంటలకు రెండు బస్సులను తిప్పుతున్నామన్నారు. జిల్లాలోని ఏ ప్రదేశం నుంచి అయినా 50 మంది ప్రయాణికులు పై తెలిపిన శైవక్షేత్రాలకు వెళ్లదలచుకుంటే వారి వద్దకే బస్సు వెళ్లి క్షేత్రదర్శినికి ఉపకరిస్తుందన్నారు.

Updated Date - 2021-11-06T05:10:24+05:30 IST