రతనాల వెంకటేశ్వరునికి శ్రవణా నక్షత్ర పూజలు

ABN , First Publish Date - 2021-11-12T04:51:05+05:30 IST

స్థానిక పాత మార్కెట్‌లోని లలితాదేవి రతనాల వెంకటేశ్వరస్వామి ఆలయం లో స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవ ణా నక్షత్రం పురష్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రతనాల వెంకటేశ్వరునికి శ్రవణా నక్షత్ర పూజలు

ప్రొద్దుటూరు టౌన్‌, నవంబరు 11: స్థానిక పాత మార్కెట్‌లోని లలితాదేవి రతనాల వెంకటేశ్వరస్వామి ఆలయం లో స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవ ణా నక్షత్రం పురష్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేకం గా అలంకరించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత రతనాల వెంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేశారు. నేడు శివాలయంలో గోపూజ : గోపాల అష్టమి సందర్భంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు గోపూజ నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్‌ రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు గోపూజ నిర్వహిస్తున్నామన్నారు.  

Updated Date - 2021-11-12T04:51:05+05:30 IST