రతనాల వేంకటేశ్వరునికి శ్రవణ నక్షత్ర పూజలు
ABN , First Publish Date - 2021-02-12T04:56:53+05:30 IST
పాత మార్కెట్‌లోని లలితాదేవి, రతనాల వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం పురష్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రొద్దుటూరు టౌన్, ఫిబ్రవరి 11: పాత మార్కెట్‌లోని లలితాదేవి, రతనాల వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం పురష్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం స్వామివారి జన్మక్షత్రమైన శ్రవణా నక్షత్రం సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం మహిళలు విష్ణు పారాయణం చేశారు.