షోకాజ్‌ నోటీసులు ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2021-11-01T04:55:43+05:30 IST

చిక్కీలు, కోడిగుడ్ల వివరాలు యాప్‌లలో నమోదు చేయలేదని, విద్యార్థులకు అందజేయలేదని కారణంతో జిల్లాలోని 207 హెడ్మాస్టర్‌లకు ఆర్జేడి ఇచ్చిన షోకాజ్‌ నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు.

షోకాజ్‌ నోటీసులు ఉపసంహరించుకోవాలి

ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి


కడప(ఎడ్యుకేషన్‌), అక్టోబరు 31 : చిక్కీలు, కోడిగుడ్ల వివరాలు యాప్‌లలో నమోదు చేయలేదని, విద్యార్థులకు అందజేయలేదని కారణంతో జిల్లాలోని 207 హెడ్మాస్టర్‌లకు ఆర్జేడి ఇచ్చిన షోకాజ్‌ నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు. పని చేయని యాప్‌లు, మోరాయిస్తున్న సర్వర్‌లకు తోడు సకాలంలో సరఫరా కాని చిక్కీలు, కోడిగుడ్లు వివరాలు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. పాఠశాలలు పునఃప్రారంభించిన రోజు నుంచి విద్యాశాఖ హెడ్‌మాస్టర్‌లను వివరాలు అడగడం తప్ప టీచర్లు, బోధనేతర సిబ్బంది అవశ్యకత గురించి పట్టించుకోలేదని విమర్శించారు. హెడ్మాస్టర్‌, ఉపాధ్యాయులను బోధనకు పరిమితం చేయాలని లేని పక్షంలో బోధనేతర కార్యక్రమాలను బహిష్కరించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. 

 

Updated Date - 2021-11-01T04:55:43+05:30 IST