మానవత్వం చూపండి : డీఎస్పీ

ABN , First Publish Date - 2021-05-31T04:27:26+05:30 IST

కొవిడ్‌-19 చికిత్సకు అనుమతి పొందిన ఆసుపత్రుల వైద్యులు, అంబులెన్స్‌ యజమానులు, డ్రైవర్లు మానవత్వం ప్రదర్శించాలని డీఎస్పీ బి.సునీల్‌ పేర్కొన్నారు.

మానవత్వం చూపండి : డీఎస్పీ
సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ సునీల్‌

కడప(క్రైం), మే 30: కొవిడ్‌-19 చికిత్సకు అనుమతి పొందిన ఆసుపత్రుల వైద్యులు, అంబులెన్స్‌ యజమానులు, డ్రైవర్లు మానవత్వం ప్రదర్శించాలని డీఎస్పీ బి.సునీల్‌ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు ఆదివారం డీఎస్పీ సునీల్‌తో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ అనిల్‌కుమార్‌లు స్థానిక ఐఎంఏ హాలులో ఆసుపత్రి వైద్యులు, అంబులెన్‌ ్స యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కరోనా రోగులను, మృతదేహాలను తరలించే అంబులెన్స్‌ డ్రైవర్లు హైదరాబాద్‌, కర్నూలు, బెంగుళూరు, తిరుపతి లాంటి ప్రాంతాలకు నిర్ణీత ధరల ప్రకారం తీసుకోవాలన్నారు. అలాగే వైద్యులు ఆరోగ్యశ్రీ ఉన్నా లేకున్నా తక్కువ ధరలోనే చికిత్స అందించాలన్నారు. అలాగే బాధితులు తమ వద్ద ఆయా యాజమాన్యాలు ఎక్కువ డిమాండ్‌ చేస్తే డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే  చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో సీఐలు సత్యనారాయణ, ఆలీ, సత్యబాబు, ప్రైవేటు కొవిడ్‌ హాస్పిటల్స్‌ వైద్యులు, అంబులెన్స్‌ యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-31T04:27:26+05:30 IST