రాజ్యాంగ నిర్మాతకు అవమానం దారుణం
ABN , First Publish Date - 2021-02-02T05:04:06+05:30 IST
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించడం దారుణమని అందుకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎర్రగుడి చంద్రబాబు ప్రభు త్వాన్ని కోరారు.

ప్రొద్దుటూరు అర్బన్, ఫిబ్రవరి 1: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించడం దారుణమని అందుకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎర్రగుడి చంద్రబాబు ప్రభు త్వాన్ని కోరారు. తూర్పుగోదావరి జిల్లా చింతలపూడిలో అంబేడ్కర్ విగ్రహం మెడలో చెప్పులదండ వేసి అవమానించిన దుండగులను అరెస్ట్ చేయాలని సోమవారం మైదుకూరు రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ దళితులపై దాడు లు అంబేడ్కర్ విగ్రహాల విధ్వంస ఘటనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాధ్యత వహించాలన్నారు. దుండగులను పట్టుకోకుంటే ఉద్యమం ఉదృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో జయరాజు, మేకల శేఖర్, ఓబయ్య, దావీదు పాల్గొన్నారు.
పట్టణ కమిటీ ఎన్నిక
ఎస్సీ కులాల హక్కుల పరరక్షణ సంఘం పట్టణ కమిటీని సోమవారం ఎన్నికున్నారు. అధ్యక్షుడిగా జెల్లి ఓబులేసు, ఉపాధ్యక్షులుగా ఆంజనుయులు, యేసన్న, ప్రధాన కార్యదర్శిగా మంగదొడ్డి రాజు, కార్యదర్శిగా రామచంద్రుడు కోశాఽధికారి గా సుబ్బరాయుడులు ఎన్నికయ్యారు.
వైసీపీ పాలనలో విగ్రహాలకు రక్షణ కరవు
ప్రొద్దుటూరు టౌన్, ఫిబ్రవరి 1: వైసీపీ పాలనలో ప్రజలతో పాటు విగ్రహాలకు రక్షణ కరువైందని ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తలారి పుల్లయ్య విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించడాన్ని నిరసిస్తూ సోమవారం అంబే డ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి క్యాండిల్స్ వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని, అలాగే ఆల యాలలో దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని, చివరకు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించడం దారుణమన్నారు. ప్రభుత్వం నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో తలారి రమేష్, బాస్కర్, చిన్నపుల్లయ్య, చిన్ననాగేంద్ర, దినకర్ పాల్గొన్నారు.
