మాస్టర్‌ప్లాన్‌తో తీవ్రనష్టం

ABN , First Publish Date - 2021-07-25T04:48:10+05:30 IST

డ్రాప్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌ వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎర్రగుంట్ల నగరపంచాయతీ రైతులు అనుడా ఛైర్మన్‌ గురుమోహన్‌ ఎదుట ఆందోళన వ్యక్తం చేశా రు.

మాస్టర్‌ప్లాన్‌తో తీవ్రనష్టం
అనుడా ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం ఇస్తున్న ఎర్రగుంట్ల రైతులు

అనుడా ఛైర్మన్‌తో ఎర్రగుంట్ల  రైతులు

ఎర్రగుంట్ల, జూలై 24: డ్రాప్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌ వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎర్రగుంట్ల నగరపంచాయతీ రైతులు  అనుడా ఛైర్మన్‌ గురుమోహన్‌ ఎదుట ఆందోళన వ్యక్తం చేశా రు. శనివారం రైతులు కడపలో అనుడా ఛైర్మన్‌ను ఆయన కార్యాలయంలో కలిసి అనుడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయ తలపెట్టిన డ్రాప్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌ వల్ల  తమకు జరుగుతున్న నష్టాన్ని, కష్టాన్ని క్షుణ్ణంగా వివరించినట్లు  తెలిపారు. మాస్టర్‌ ప్లాన్‌ వల్ల సుమారు వందలాదిమంది రైతులకు చెందిన 800ఎకరాల వ్యవసాయ సాగుభూమిని కోల్పోవాల్సి వస్తుం దన్నారు. వ్యయసాయమే ఆధారంగా జీవించే రైతుల పరిస్థితి ఏంటనివారు ప్రశ్నించారు. రైతులకు చెందిన మొత్తం 1బీ, అడంగల్‌, పాస్‌బుక్స్‌ జిరాక్స్‌ల ప్రతులను రైతులు వారికి అందజేశారు. ఇంత వ్యతిరేకత ఉందా అని ఛైర్మన్‌ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు రైతులు తెలిపారు. ఛైర్మన్‌ను కలి సిన వారిలో జి.మైసూరారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పి.హరికిష్ణా రెడ్డి, రాజారెడ్డి, వీరభద్రారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఉపేంద్రారెడ్డి, రామారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, చిట్టిబాబు, జి.హరినాథరెడ్డి పాల్గొన్నారు. అభ్యంతరాలు తెలిపేందుకు శనివారం చివరిరోజు కావడంతో చాలా మంది  రిజిష్టర్‌ పోస్టులు, మెయిల్‌ ద్వారా, స్వయంగా కలిసి   భారీ ఎత్తున అభ్యంతరాలను తెలియజేశారు. 

 భూములు కొని అభివృద్ధి చేస్తాం : ఛైర్మన్‌ 

రైతుల భూములుకొని ప్లాట్లు వేసి అభివృద్ది చేస్తామని ఛైర్మ న్‌ గురుమోహన్‌ పేర్కొన్నారు. భూముల విలువపెరుగుతా యన్నారు. అయితే రైతుల భూమిని మొత్తం కొనాలని తాము ఊరు వదిలిపోతామని రైతు మైసూరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా పట్టణాలు అభివృద్ధి చేసి తర్వాత ఎర్రగుంట్ల జోలికిరావాలన్నారు. త్వరలో రైతు సం రక్షణ కమిటిని ఏర్పాటు చేసి ఉద్యమించేందుకు వెనుకాడ మని  తెలిపారు. 

Updated Date - 2021-07-25T04:48:10+05:30 IST