రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-12-09T04:30:32+05:30 IST

కడప నగరం ఆలంఖాన్‌పల్లె మెయిన్‌ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు
ప్రమాదంలో గాయపడ్డ రామకృష్ణారెడ్డి, అరుణమ్మ

కడప(క్రైం), డిసెంబరు 8: కడప నగరం ఆలంఖాన్‌పల్లె మెయిన్‌ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు 108లో రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌ ఔట్‌పోస్టు పోలీసుల వివరాల మేరకు... అనంతపురం జిల్లాకు చెందిన రామకృష్ణారెడ్డి కడప ఎర్రముక్కపల్లెలో నివాసం ఉంటున్నాడు. బుధవారం ఉదయం ఆలంఖాన్‌పల్లెలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం దర్శనానికి ద్విచక్ర వాహనంలో భార్య అరుణమ్మతో కలిసి వెళుతుండగా.. కడప నుంచి మైదుకూరు వైపు వెళుతున్న ఓ కారు వెనుక నుంచి వేగంగా వచ్చి వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో భార్యాభర్తలు కిందపడి తీవ్రగాయాల పాలైనట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తాలూకా పోలీ్‌సస్టేషన్‌కు బదలాయించినట్లు తెలిపారు. 

Updated Date - 2021-12-09T04:30:32+05:30 IST