రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2021-11-03T05:17:57+05:30 IST

కడప- తాడిపత్రి హైవే రోడ్డులోని రామిరెడ్డి కొట్టాలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

వల్లూరు, నవంబరు 2: కడప- తాడిపత్రి హైవే రోడ్డులోని రామిరెడ్డి కొట్టాలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వారిచ్చిన సమాచారం మేరకు... వల్లూరు మండలం ఏ.ఓబాయపల్లె గ్రామానికి చెందిన వెంకటసుబ్బారెడ్డి కడపలో తన సొంత పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంలో వస్తుండగా రామిరెడ్డి కొట్టాలు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. క్షతగాత్రుడిని 108లో చికిత్స నిమిత్తం కడపకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Updated Date - 2021-11-03T05:17:57+05:30 IST