హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి భద్రత చెక్కు

ABN , First Publish Date - 2021-11-03T05:18:45+05:30 IST

కడప పీసీఆర్‌లో విధులు నిర్వర్తిస్తూ ఇటీవల మరణించిన హెడ్‌ కానిస్టేబుల్‌ ఓ.విజయ్‌కుమార్‌ సతీమణి రమాదేవికి రూ.3,99,160 భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కును సోమవారం ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు.

హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి భద్రత చెక్కు
చెక్కు అందజేస్తున్న ఎస్పీ అన్బురాజన్‌

కడప(క్రైం), నవంబరు 2: కడప పీసీఆర్‌లో విధులు నిర్వర్తిస్తూ ఇటీవల మరణించిన హెడ్‌ కానిస్టేబుల్‌ ఓ.విజయ్‌కుమార్‌ సతీమణి రమాదేవికి రూ.3,99,160 భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కును సోమవారం ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా దివంగత హెడ్‌కానిస్టేబుల్‌ కుటుంబ యోగక్షేమాల వివరాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్‌), ఎం.దేవప్రసాద్‌, జిల్లా పోలీసు కార్యాలయం ఇన్‌చార్జ్‌ పరిపాలనాధికారి, ఫ్యాక్షన్‌ జోన్‌ డీఎస్పీ చెంచుబాబు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్‌, గౌరవాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


మీ సేవలు చిరస్మరణీయం 

దాదాపు 35 ఏళ్ల పాటు అంకితభావంతో పోలీసు శాఖకు అందించిన సేవలను శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీసు కాన్ఫరెన్స్‌ హాలులో అక్టోబరు నెలాఖరున పదవీ విరమణ పొందిన ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ వి.వీరబ్రహ్మంను ఎస్పీ అన్బురాజన్‌ సన్మానించి మాట్లాడారు. పదవీ విరమణ తరువాత కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. 

Updated Date - 2021-11-03T05:18:45+05:30 IST