రేపటి నుంచి రెండో విడత పోరు

ABN , First Publish Date - 2021-02-01T05:44:38+05:30 IST

తొలి విడత కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. రెండో విడత పల్లెపోరుకు తెరలేచింది. 2వ తేదీ ఫేజ్‌-2 కింద కడప రెవెన్యూ డివిజనలో 12 మండలాల్లో 175 పంచాయతీలకు రిటర్నింగ్‌ అధికారులు మంగళవారం నోటిఫికేషన జారీ చేస్తారు.

రేపటి నుంచి రెండో విడత పోరు

175 పంచాయతీలకు ఎన్నికలు

నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

అన్ని చోట్లా పోటీకి ప్రధాన పార్టీల సన్నాహాలు

(కడప-ఆంధ్రజ్యోతి): తొలి విడత కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. రెండో విడత పల్లెపోరుకు తెరలేచింది. 2వ తేదీ ఫేజ్‌-2 కింద కడప రెవెన్యూ డివిజనలో 12 మండలాల్లో 175 పంచాయతీలకు రిటర్నింగ్‌ అధికారులు మంగళవారం నోటిఫికేషన జారీ చేస్తారు. అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. క్లస్టర్ల వారీగా నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాయచోటి, కమలాపురం నియోజకవర్గాల్లో ఫేజ్‌-2 ఎన్నికలు జరగనున్నాయి. అన్ని స్థానాల్లో మద్దతుదారులను బరిలో దింపేందుకు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ నాయకులు ఇప్పటికే సన్నహాల్లో నిమగ్నమయ్యారు. కమలాపురం నియోజకవర్గంలో అన్ని పంచాయతీల్లో మద్దతుదారులను పోటీకి దింపేందుకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి ఇప్పటికే గ్రామ నాయకులతో చర్చలు పూర్తి చేశారు. రాయచోటి నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపికలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి నిమగ్నమయ్యారు. అదే క్రమంలో రాయచోటి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంతరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రరనాథరెడ్డిలు ఏకగ్రీవాలకు ఓ పక్క ఎత్తులు వేస్తూనే.. ఎన్నికలు అనివార్యమైతే మెజార్టీ స్థానాల్లో గెలుపు కోసం అంగ, అర్థ బలం కలిగిన అభ్యర్థులను దింపేందుకు పావులు కదుపుతున్నారు.  రెండో విడతలో 181 పంచాయతీలు, 1806 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంటే కోర్టు స్టే వల్ల 6 పంచాయతీల ఎన్నికల వాయిదా పడ్డాయి. దీంతో 174 పంచాయతీలు, 1756 వార్డులకు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. 


రెండో విడత...

మండలం పంచాయతీల రిజర్వేషన్లు వార్డుల పోలింగ్‌ కేంద్రాలు

మహిళలు జనరల్‌ మొత్తం

-------------------------------------------------------------------------------------------------------

రాయచోటి 3 6 9 100 100

గాలివీడు 9 8 17 180 180

చిన్నమండెం 7 6 13 134 134

సంబేపల్లి 6 8 14 138 138

లక్కిరెడ్డిపల్లె 8 8 16 154 154

రామాపురం 7 6 13 134 134

కమలాపురం 9 8 17 158 158

వీఎన పల్లె 11 11 22 196 196

పెండ్లిమర్రి 10 9 19 194 194

సీకే దిన్నె 4 8 12 128 128

వల్లూరు 6 7 13 134 134

చెన్నూరు 5 5 10 106 106

-------------------------------------------------------------------------------------------------------

మొత్తం 85 90 175 1,756 1,756

--------------------------------------------------------------------------------------------------------

రెండో విడత ఎన్నికల షెడ్యూలు: 

-----------------------------------------------------------------------------

నామినేషన్ల స్వీకరణ : ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకు

పరిశీలన : ఫిబ్రవరి 5న ఉదయం 8 గంటల నుంచి

అప్పీలు చేసేందుకు : ఫిబ్రవరి 6న సాయంత్రం 5 గంటల వరకు

అప్పీళ్ల పరిష్కారం : ఫిబ్రవరి 7న

నామినేషన్ల ఉపసంహరణ : ఫిబ్రవరి 8న సాయంత్రం 3 గంటలు, తరువాత అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ

పోలింగ్‌ : ఫిబ్రవరి 13న ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు

ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచి ఎంపిక : ఫిబ్రవరి 13న సాయంత్రం 3 గంటల నుంచి, లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాల వెల్లడి, ఆ వెంటనే ఉప సర్పంచి ఎన్నిక ఉంటుంది.

Updated Date - 2021-02-01T05:44:38+05:30 IST