ఉప్పు వాగు పూడిక తీయాలి

ABN , First Publish Date - 2021-12-09T04:24:25+05:30 IST

పట్టణం మీదుగా వెళ్తున్న ఉప్పువాగు పూడిక తీసి కాలనీవాసుల కష్టాలు తీర్చాలని సీపీఎం మండల కార్యదర్శి షరీఫ్‌ కోరారు.

ఉప్పు వాగు పూడిక తీయాలి
ఇటీవల కురిసిన వర్షంతో కాలనీలో నీరు పాచిపట్టిన దృశ్యం

మైదుకూరు, డిసెంబరు 8: పట్టణం మీదుగా వెళ్తున్న ఉప్పువాగు పూడిక తీసి కాలనీవాసుల కష్టాలు తీర్చాలని సీపీఎం మండల కార్యదర్శి షరీఫ్‌ కోరారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో ఇందిర మ్మ, చెంచు, వెంకటసుబ్బయ్య, వీణవిజయనగరీ కాలనీలు, సుంద రయ్యనగర్‌లో వారు పరిశీలించారు.

ఉప్పువంకవాగు పూడిక తీయ క పోవడంతో ఎప్పుడు వర్షాలు కురిసినా కాలనీల్లోని ఇళ్లల్లోకి నాలు గడుగులు నీరు చేరి వస్తు, సామగ్రి తడిసిపోతుంటాయని వాపో యారు. అధికారులు వాగు పూడిక తీసి సమస్య పరిష్కరించాలని కోరారు.  కార్యక్రమంలో నేతలు సుబ్బరాయుడు, ఒబన్న, దేవదా నం, బాలరాజు, లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-09T04:24:25+05:30 IST