పథకాలను నోటీసుబోర్డులో ప్రదర్శించాలి : కమిషనర్
ABN , First Publish Date - 2021-09-04T05:04:17+05:30 IST
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు సచివాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శించాలని కమిషనర్ రంగస్వామి పేర్కొన్నారు. కడప నగరం 29వ డివిజన్‌లో శుక్రవారం సచివాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

కడప(ఎర్రముక్కపల్లె), సెప్టెంబరు 3: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు సచివాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శించాలని కమిషనర్ రంగస్వామి పేర్కొన్నారు. కడప నగరం 29వ డివిజన్‌లో శుక్రవారం సచివాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా సిబ్బంది హాజరు పరిశీలించారు. స్పందన ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి సంబంధించి డాష్‌బోర్డును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా వారి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మేనేజర్ ఇదయతుల్లా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.