సర్వేపల్లి రాధాకృష్ణన్ మార్గదర్శకుడు
ABN , First Publish Date - 2021-09-06T05:15:21+05:30 IST
మాజీ రాష్ట్రప తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మార్గదర్శకుడని వక్తలు పేర్కొన్నారు.
ప్రొద్దుటూరు టౌన్, సెప్టెంబరు 5: మాజీ రాష్ట్రప తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మార్గదర్శకుడని వక్తలు పేర్కొన్నారు. ఆదివారం ఏపీటీఎఫ్ సంఘ కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లె రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించకుని ఆయన చిత్రపటానికి ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాం సుందర్‌రెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మునివర్దన్‌కుమార్, రమే్‌షరెడ్డి, కుళాయిరెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, ప్రసాద్‌రావు, జమాల్‌వలి, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ రత్న అవార్డును ఇవ్వాలి
ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ రత్న అవార్డు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సంఘం కార్యాలయం వద్ద డాక్టర్ సర్వేపల్లె రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు అంకాల్‌కొండయ్య, రాష్ట్ర కార్యదర్శి గంగాధర్, డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డి, ఓబులేసు, ఏపీసీపీఎస్ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ వెంకటజనార్ధన్‌రెడ్డి, యూటీఎఫ్ పట్టణాధ్యక్షులు సుందరం, ఆపస్ జిల్లా అధ్యక్షుడు గజ్జెల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామేశ్వరం బాలబాలికల గ్రంథాలయంలో సర్వేపల్లె రాధాకృష్ణన్ చిత్రపటానికి గ్రంథాలయం రికార్డు అసిస్టెంట్ ఇబ్రహీంసాహెబ్ పూలమా లవేసి నివాళులర్పించారు. కరుమూరి వెంకటరమణ, వెంకటకొండయ్య, శివకేశవ, సుబ్బయ్య, ప్రతాప్ పాల్గొన్నారు.
ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
ఎర్రగుంట్ల, సెప్టెంబరు 5: ఉపాధ్యాయ దినోత్స వ వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకు న్నారు. ఈ సందర్భంగా చిలమకూరులో పనిచేస్తున్న తెలుగుపండిట్ బద్రిపల్లె శ్రీనివాసులు, ఎర్రగుంట్ల జడ్పీ హైస్కూల్‌లో పనిచేస్తున్న ఎం ఎ్‌సజేశశికళ, కదివారిపల్లెలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు నాగేశ్వరరావును శాలువకప్పి, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో మానవతసేవాసంస్థకు చెందిన రాజవర్దన్‌రెడ్డి, లక్ష్మణుడు, చెన్నకేశరెడ్డి, క్రిష్ణమూర్తి, మధుసూధన్‌రెడ్డి, హాజీవల్లి, గం గాధర్‌రెడ్డి, పెద్దిరెడ్డి, రామారావు పాల్గొన్నారు. ఎంపీ స్కూల్‌లో హెచ్‌ఎం కే.సుబ్బిరెడ్డి ఆధ్వర్యంలో విశ్రాం త ఉపాధ్యాయుడు సాంబశివుడిని ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు రంగయ్య, కేవీకృష్ణారెడ్డి, బి.శివప్రసాద్‌రెడ్డి, రామక్రిష్ణ, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
