పారిశుధ్యం మెరుగుపడాలి : కమిషనర్‌

ABN , First Publish Date - 2021-10-22T05:06:53+05:30 IST

నగరంలో పారిశుధ్యం మరింత మెరుగుపడాలని కమిషనర్‌ రంగస్వామి ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం వార్డు శానిటేషన్‌, ఎన్విరాన్మెంటల్‌ సెక్రటరీలతో సమావేశం ఏర్పాటు చేశారు.

పారిశుధ్యం మెరుగుపడాలి : కమిషనర్‌

కడప(ఎర్రముక్కపల్లె), అక్టోబరు 21: నగరంలో పారిశుధ్యం మరింత మెరుగుపడాలని కమిషనర్‌ రంగస్వామి ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం వార్డు శానిటేషన్‌, ఎన్విరాన్మెంటల్‌ సెక్రటరీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఎక్కడా చెత్త ఉండరాదని, ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం తప్పనిసరిగా పారిశుధ్య కార్మికులు చెత్త సేకరణ చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ ఎంహెచ్‌వో రమణారెడ్డి, అడిషనల్‌ కమిషనర్‌ సి.చరణ్‌తేజరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, వార్డు శానిటేషన్‌ సెక్రటరీలు, నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T05:06:53+05:30 IST