‘హామీలను మరిచిన పాలకులు’

ABN , First Publish Date - 2021-03-22T04:49:01+05:30 IST

విభజన సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని పాలకులు అమలు పరచకుండా విస్మరించి ప్రజలను మోసం చేశారని ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు వి.రవిశంకర్‌రెడ్డి ఆరోపించారు.

‘హామీలను మరిచిన పాలకులు’
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి

రాజంపేట, మార్చి21 :  విభజన సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని పాలకులు అమలు పరచకుండా విస్మరించి ప్రజలను మోసం చేశారని ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు వి.రవిశంకర్‌రెడ్డి  ఆరోపించారు. ఆదివారం రాజంపేట పట్టణంలోని ఓ కళాశాలలో ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌ ఆధ్వర్యంలో జిల్లా 6వ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వి.రవిశంకర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 విభజన సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీలను పాలకులు అమలు పరచకుండా ప్రజలను మోసం చేశారన్నారు. వెనుకబడిన ప్రాంతాలను రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఒకే మాట మీద నిలబడి కేంద్రం దుర్మార్గమైన నిర్ణయాలపైన కలిసి పోరాడి హక్కులను సాధించు కుందామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీటీడీలో ఖాళీగా ఉన్న 8000ఉద్యోగాలు రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, కడప నీరజ్‌, బద్వేల్‌ నాగసుబ్బయ్య, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-22T04:49:01+05:30 IST