ఆర్టీసీ బస్సు, స్కూటర్‌ ఢీ

ABN , First Publish Date - 2021-03-22T04:50:27+05:30 IST

మండల పరిధిలోని కడప-చెన్నై జాతీయ రహదారిపై కొత్త మాధవరం గ్రామ సమీపాన ఆదివారం సాయంత్రం కడప నుంచి స్కూటర్‌పై వస్తున్న దార నరసింహులుకు తీవ్ర గాయా లయ్యాయి.

ఆర్టీసీ బస్సు, స్కూటర్‌ ఢీ

ఒంటిమిట్ట, మార్చి21 : మండల పరిధిలోని కడప-చెన్నై జాతీయ రహదారిపై కొత్త మాధవరం గ్రామ సమీపాన ఆదివారం సాయంత్రం కడప నుంచి స్కూటర్‌పై వస్తున్న దార నరసింహులుకు తీవ్ర గాయా లయ్యాయి. తిరుపతి నుంచి కడపకు వెళుతున్న ఆర్టీసీ బస్సు  ను స్కూటర్‌ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. రెవెన్యూ శాఖలో పదోన్న తి కోసం కడపలో పరీక్షకు హాజరై తిరిగి రెండు నిమిషాల్లో ఇంటికి చేరే సమయంలో ఘటన చోటు చేసుకుంది. ఇతను ఒంటిమిట్ట మండలం నడింపల్లె గ్రామంవీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తున్నారు. వెంటనే 108లో కడప రిమ్స్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Updated Date - 2021-03-22T04:50:27+05:30 IST