ఆర్‌ఎ్‌సఐ బలవన్మరణం

ABN , First Publish Date - 2021-12-31T06:58:47+05:30 IST

కడప ఏఆర్‌ విభాగంలో ఆర్‌ఎ్‌సఐగా విధులు నిర్వహిస్తున్న పైలా చంద్రారావు(26) గురువారం ఎన్జీవో కాలనీలోని తన గదిలో ఫ్యానకు ఉరి వేసుకున్నారు. విషయం తెలుసుకున్న వనటౌన సీఐ సత్యనారాయణ, చిన్నచౌక్‌ సీఐ అశోక్‌రెడ్డి సంఘటన స్థలం వద్దకు వెళ్లారు.

ఆర్‌ఎ్‌సఐ బలవన్మరణం
ఆత్మహత్యకు పాల్పడ్డ ఆర్‌ఎ్‌సఐ చంద్రారావు మృతదేహం

కడప(క్రైం), డిసెంబరు 30 : కడప ఏఆర్‌ విభాగంలో ఆర్‌ఎ్‌సఐగా విధులు నిర్వహిస్తున్న పైలా చంద్రారావు(26) గురువారం ఎన్జీవో కాలనీలోని తన గదిలో ఫ్యానకు ఉరి వేసుకున్నారు. విషయం తెలుసుకున్న వనటౌన సీఐ సత్యనారాయణ, చిన్నచౌక్‌ సీఐ అశోక్‌రెడ్డి సంఘటన స్థలం వద్దకు వెళ్లారు. ఆర్‌ఎస్‌ఐ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా హుటాహుటిన కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే ఆయన మృతిచెందారు. చిన్నచౌక్‌ సీఐ అశోక్‌రెడ్డి వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా సర్బూజి మండలం రొట్టవలస గ్రామానికి చెందిన పైలా చంద్రారావు ఏడాది క్రితం ట్రైనింగ్‌ పూర్తి చేసుకొని కడప ఏఆర్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ సొంత గ్రామానికి వెళ్లి 27వ తేదీన తిరిగి వచ్చారు. అయితే తనకు పోలీసు ఉద్యోగం చేయడం ఇష్టం లేదని, మానసికంగా విధులు నిర్వహించలేకపోతున్నానని, తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్‌ఎ్‌సఐ గదిలో సూసైడ్‌ లెటర్‌ స్వాధీనం చేసుకున్నామని, ఆత్మహత్యకు గల కారణాల పై విచారిస్తున్నామని సీఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి ఈ మేరకు బంధువులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. కాగా ఆస్పత్రిలో ఉన్న ఆర్‌ఎ్‌సఐ మృతదేహాన్ని ఎస్పీ కేకేఎన అన్బురాజన పరిశీలించారు.

Updated Date - 2021-12-31T06:58:47+05:30 IST