ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-05-09T04:40:01+05:30 IST

కలసపాడు మండల పరిధిలోని ముగ్గురాయి గని యజమాని అసమర్ధత వల్లే బ్లాస్టింగ్‌ జరిగి ప్రాణాల్లో గాల్లో కలిశాయని, ఒక్కో కు టుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలి

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి

కడప, మే 8 (ఆంధ్రజ్యోతి): కలసపాడు మండల పరిధిలోని ముగ్గురాయి గని యజమాని అసమర్ధత వల్లే బ్లాస్టింగ్‌ జరిగి ప్రాణాల్లో గాల్లో కలిశాయని, ఒక్కో కు టుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ర క్షణ చర్యలున్న వాహనం ద్వారా పేలుడు పదార్థాలు అందించాల్సి ఉండగా అలా చేయకపోవడంతోనే దుర్ఘటన జరిగిందన్నారు. మైన్స్‌ అధికారుల పర్యవేక్షణ లేదని, వారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మైన్స్‌ యజమానిపై 302 చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. అలాగే చనిపోయిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి రూ.50లక్షల నష్టపరిహారం అందించాలని డిమాం డ్‌ చేశారు. అధికారపార్టీకి చెందిన వారైనందున కేసులు బలహీనపరచకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, ఎస్పీలకు రెడ్యం విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-05-09T04:40:01+05:30 IST