మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-06-23T05:29:29+05:30 IST

మండలంలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామంలో చేపలవేటకు వెళ్లి మృతిచెందిన గోవర్దన్‌రెడ్డి, సుభాషిణి కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం చెల్లించాలని మండల టీడీపీ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి డి మాండ్‌ చేశారు.

మృతుల కుటుంబాలకు   రూ.10లక్షల పరిహారం ఇవ్వాలి

కొండాపురం, జూన్‌ 22: మండలంలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామంలో చేపలవేటకు వెళ్లి మృతిచెందిన గోవర్దన్‌రెడ్డి, సుభాషిణి కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం చెల్లించాలని మండల టీడీపీ నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి డి మాండ్‌ చేశారు. మండలంలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముంపు గ్రామాలకు ప్రభుత్వం ఆర్థిక వనరులు కల్పించకుండా గండికోట కింద గ్రామాలను ముంచారని  ధ్వజమెత్తారు. ఇటీవల మృతిచెందిన వారు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. పనులు లేకపోవడం వలన ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి ఉపాధి కల్పించాలని కోరారు. 

Updated Date - 2021-06-23T05:29:29+05:30 IST