వర్షాలకు రూ.10 కోట్లు నష్టం
ABN , First Publish Date - 2021-11-29T05:17:59+05:30 IST
అధిక వర్షాలకు మండలంలో సుమా రు 10 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు గణాంక అధికారి బాలరాజు అంచనా వేస్తున్నారు.

సంబేపల్లె, నవంబరు28: అధిక వర్షాలకు మండలంలో సుమా రు 10 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు గణాంక అధికారి బాలరాజు అంచనా వేస్తున్నారు. ఒక ఎకరాకు 10- 15 వేల రూపాయలు నష్టం జరిగినా మండలంలో ఖరీఫ్ కింద 9317 ఎకరాల్లో సాగు చేశారు. దీని ప్రకారం 10 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. ఊడలు దిగే సమయంలో వర్షాలు పడలేదన్నారు. దీంతో కాయల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. బుడ్డల దశలు వర్షాలు అధికంగా పడడంతో 3 కాయలు, 6 బుడ్డలుగా ఎకరాకు రెండు నుంచి మూడు బస్తాలు దిగుబడి వచ్చింది. దీంతో ప్రతి రైతు 10 నుంచి 15 వేల రూపాయలు నష్టపోయారు. పంట నూర్పిడి సమయంలో ఎడతెరిపి లేని వర్షాలతో పొలాలపైనే పూర్తిగా నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.