పరిహారం పంపిణీ పూర్తి చేస్తే రోడ్డు విస్తరణ చేపడతాం: డీఈ

ABN , First Publish Date - 2021-05-21T04:39:46+05:30 IST

పరిహారం చెల్లిస్తే రోడ్డు విస్తరణ పనులు చేపడతామని ఆర్‌అండ్‌బీ డీఈ షేక్షావల్లి, అన్నారు.

పరిహారం పంపిణీ పూర్తి చేస్తే రోడ్డు విస్తరణ చేపడతాం: డీఈ
రోడ్డును పరిశీలిస్తున్న ఆర్‌అండ్‌బీ డీఈ షేక్షావల్లి, ఏఈ అన్వర్‌బాషా

 సిద్దవటం మే20 : పరిహారం చెల్లిస్తే రోడ్డు విస్తరణ పనులు చేపడతామని ఆర్‌అండ్‌బీ డీఈ షేక్షావల్లి, అన్నారు. సిద్దవటంలో రోడ్డు విస్త రణ పనులపై గురువారం తహశీల్దారు ర మాకుమారితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ సిద్దవటంలో రోడ్డు విస్తరణకు సంబంధించి కొందరికి పరి హారం చెల్లించాల్సి ఉందని, వారికి చెల్లించి త్వరి తగతిన తమకు స్థలాన్ని అప్పగించాలని కోరా రు. తహశీల్దారు స్పందిస్తూ కట్టడాలకు చెందిన నెంబర్లు, యజమాని పేరు వంటి వివరాల నివే దికను తమకు ఇవ్వాలన్నారు. నివేదికను పరిశీ లించి సంబంధిత యజమానులతో మాట్లాడతామన్నారు. అలాగే పెన్నా బ్రిడ్జిపై బీటీకి సంబంధించిన పనులు, సిద్దవటంలో రోడ్డు విస్తరణకు సంబంధించి 85లక్షలతో టెండర్‌ పూర్తి అయ్యిందన్నారు. అలాగే జ్యోతి నుంచి పంచలింగాల వరకు ఉన్న రోడ్డును పరిశీలించామన్నారు. పంచలింగాల వరకు తారు రోడ్డు వేసేందుకు డీజీపీఎస్‌ సర్వే చేశారన్నారు. పరిశీలించి నివేదికను కడప డీఎఫ్‌ఓకు సమర్పిస్తామన్నారు.

Updated Date - 2021-05-21T04:39:46+05:30 IST