ఘనంగా వరలక్ష్మీ మాత పూజ

ABN , First Publish Date - 2021-12-27T05:25:43+05:30 IST

రాజంపేట పట్టణంలోని ఓ జూనియర్‌ కళాశాల ఆవరణలో ధనుర్మాసం సందర్భంగా సర్వకార్యసిద్ధి వరలక్ష్మీ మాత పూజా మహోత్సవాన్నిఘనంగా నిర్వహించారు.

ఘనంగా వరలక్ష్మీ మాత పూజ
వరలక్ష్మీ అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్న వేదపండితులు

రాజంపేట, డిసెంబరు26 : రాజంపేట పట్టణంలోని ఓ జూనియర్‌ కళాశాల ఆవరణలో ధనుర్మాసం సందర్భంగా సర్వకార్యసిద్ధి వరలక్ష్మీ మాత పూజా మహోత్సవాన్నిఘనంగా నిర్వహించారు. ఆదివారం వేదపండితులు వేదోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులరెడ్డి, వీరబల్లికి చెందిన మదన్‌రెడ్డి, సౌమ్యనాథస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ సౌమిత్రి చంద్రనాఽథ్‌, న్యాయవాది కె.ఎల్‌.నరసింహ, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-27T05:25:43+05:30 IST