ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2021-08-26T04:41:53+05:30 IST

శ్రావణమాసం శుభాల మాసమని ఎక్కడ చూసినా ఆలయాల భూమి పూ జ, విగ్రహాల ప్రతిష్ఠ, హోమాలు వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ
కరణంవారిపల్లెలో ప్రత్యేక పూజల్లో విగ్రహాలు

కరణంవారిపల్లెలో రామస్వామి

బెడుసుపల్లెలో రేణుకాయల్లమ్మ

రెడ్డినగర్‌లో ప్రత్యేక పూజలు

 శ్రావణమాసం శుభాల మాసమని ఎక్కడ చూసినా ఆలయాల భూమి పూ జ, విగ్రహాల ప్రతిష్ఠ, హోమాలు వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తు లు బిజిబిజీగా గడుపుతున్నారు. కలస పాడు మండలం కరణంవారిపల్లెలో బుధవారం నుంచి రామస్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది.  గోపవరం మండలం బెడుసుపల్లెలో రేణు కా యల్లమ్మ పోతురాజు విగ్రహాల ప్రతి ష్ఠ చేపట్టారు. పోరుమామిళ్ల మండలం రెడ్డినగర్‌లో రామాలయానికి ప్రత్యేక పూజలు చేసి రాతి ద్వార బంధనం నిలబెట్టారు. వివరాల్లోకెళితే....  

కలసపాడు, ఆగస్టు 25: కరణంవారిపల్లెలో బుధవారం నుంచి రామస్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఉదయం 9గంటల నుంచి గంగానయనం, అఖండ దీ పారాధన, గణపతిపూజ, కలశ స్థాపన, నవగ్రహారాధన, మూలమంత్ర జపం, యంత్రాల కు అభిషేకాలు జరిగాయి. సాయంత్రం ప్ర త్యేక పూజలు జరిగాయి. గురువారం వేకువ నుంచే ప్రత్యేక పూజలు చండీహోమం జరుగుతాయని తెలిపారు. శుక్రవారం గర్తపూజ, యంత్రప్రతిష్ఠ, శిఖర కలశం, విగ్రహ, ధ్వజ ప్రతిష్ఠ, కల్యాణం, జ్వాలా దర్శనం, ధృవ దర్శ నం, పూర్ణాహుతి ఉంటుందన్నారు. రుత్వికు డు వారణాసి వెంకటరమణయ్య పాల్గొన్నారు. 

బెడుసుపల్లెలో...

గోపవరం, ఆగస్టు 25: బెడుసుపల్లెలో రేణు కా యల్లమ్మ పోతురాజు విగ్రహాల ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. మూడురోజులుగా విగ్రహ ప్రతిష్ఠలో భాగంగా విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. సంఘి శ్రీరామశ ర్మ, కోదండ రామశర్మ ఆధ్వర్యంలో వేకువ నుంచే విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం పోతురాజు విగ్రహాన్ని గ్రా మోత్సవం నిర్వహించి ప్రతిష్ఠించారు. మధ్యా హ్నం అన్నదానం చేశారు.

మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ నేతలు డాక్టర్‌ రాజశేఖర్‌, రితీ్‌షకుమార్‌రెడ్డి, యల్లారెడ్డి, బాలచెన్నయ్య, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. సా యంత్రం స్వామివార్ల ఉత్సవ విగ్రహాన్ని ఊ రేగించారు. పరిసర గ్రామాల ప్రజలు పాల్గొ ని పూజలు చేయించి ప్రసాదాలు స్వీకరించారు. 

రెడ్డినగర్‌లో...

పోరుమామిళ్ల, ఆగస్టు 25: రెడ్డినగర్‌లో కొత్త గా నిర్మిస్తున్న రామాలయానికి సర్పంచ్‌ చి త్తా రవిప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చిత్తా విజయప్రతా్‌పరెడ్డి ఆలయ కమిటీ ఛైర్మన్‌ పాలకొలను రామసుబ్బారెడ్డి ప్రత్యేక పూజలు చే శారు. రెడ్డినగర్‌లో దాదాపు నాలుగు వేల కు టుంబాలకు అందుబాటులో రామాయలం, వరసిద్ధి వినాయక ఆలయం, అభయాంజనేయస్వామి భారీ విగ్రహం ఉంటుందన్నారు. ఇప్పటి వరకు దాతల సాయంతో నిర్మాణ ప నులు సాగించినా దాతలు మరిందరు ముం దుకు సాయమందిస్తే త్వరలో ఆలయ నిర్మా ణం పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో రా జారెడ్డి, గిరి ప్రణీత్‌రెడ్డి, కల్వకూరి రమణ, ఆదిబోయిన కొండయ్య పాల్గొన్నారు.Updated Date - 2021-08-26T04:41:53+05:30 IST