స్పందన కార్యక్రమం తాత్కాలికంగా రద్దు: కలెక్టర్
ABN , First Publish Date - 2021-11-29T05:18:47+05:30 IST
భారీ వర్షాల కారణంగా ఈనెల 29వ తేదీ సోమవారం స్పందన అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయరామరాజు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కడప(కలెక్టరేట్), నవంబరు 28: భారీ వర్షాల కారణంగా ఈనెల 29వ తేదీ సోమవారం స్పందన అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయరామరాజు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి స్పందన పిర్యాదులను సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావద్దని ఆ ప్రకటనలో కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.