అనుమతులుంటే రిజిస్ట్రేషన్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-05-19T05:04:21+05:30 IST

నగరపాలక సంస్థ పరిధిలోని లేఅవుట్లకు కార్పొరేషన్‌ అనుమతులు ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేయాలని మేయర్‌ సురే్‌షబాబు పేర్కొన్నారు.

అనుమతులుంటే రిజిస్ట్రేషన్‌ చేయాలి
అధికారులతో మాట్లాడుతున్న మేయర్‌ సురే్‌షబాబు

మేయర్‌ సురే్‌షబాబు

కడప(ఎర్రముక్కపల్లె), మే 18: నగరపాలక సంస్థ పరిధిలోని లేఅవుట్లకు కార్పొరేషన్‌ అనుమతులు ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేయాలని మేయర్‌ సురే్‌షబాబు పేర్కొన్నారు. కార్పొరేషన్‌ మేయరు ఛాంబరులో మంగళవారం ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ బాబురావు అధ్యక్షతన సబ్‌రిజిస్ట్రార్లు (అర్బన్‌, రూరల్‌), టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో దాదాపు 180కి పైగా అనధికార లేఅవుట్లు ఉన్నాయని, కార్పొరేషన్‌ క్లియరెన్స్‌ లేకుంటే రిజిస్ట్రేషన్‌ చేయకూడదని సూచించారు. దీనిపై ప్రభుత్వం కూడా జీవో విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-19T05:04:21+05:30 IST