పరిషతకు మళ్లీ ఎన్నికలు
ABN , First Publish Date - 2021-05-22T05:18:47+05:30 IST
ఏప్రిల్ 8న జరిగిన పరిషత ఎన్నికలను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం మళ్లీ నోటిఫికేషన జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.

ఇప్పటికే నిర్వహించిన పోలింగ్ రద్దు
సుప్రీం నిబంధనల ప్రకారం నోటిఫికేషన జారీకి హైకోర్టు ఆదేశాలు
జిల్లాలో 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకే ఎన్నికలు
(కడప-ఆంధ్రజ్యోతి): ఏప్రిల్ 8న జరిగిన పరిషత ఎన్నికలను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం మళ్లీ నోటిఫికేషన జారీ చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. గత ఏడాది ఏ దశలో ఎన్నికల వాయిదా వేశారో.. అక్కడి నుంచి మళ్లీ నిర్వహిస్తారు. జిల్లాలో 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 421 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆ వివరాలు ఇలా..
జిల్లాలో గత ఏడాది కరోనాకు ముందు ఎన్నికల నోటిఫికేషన ఇవ్వగా 50 జడ్పీటీసీ స్థానాల్లో 38 అయ్యాయి. 50 మండల పరిషతల పరిధిలో 554 ఎంపీటీసీ స్థానాలకు 432 ఏకగ్రీవం అయ్యాయి. వివిధ కారణాలతో ఐదు స్థానాలకు ఎన్నికలు పెండింగ్ పడగా 117 ఎంపీటీసీ స్థానాలకు, 12 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్ 8న ఎన్నికలు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. ఈ సమయంలో కోర్టు తీర్పుతో ఈ ఎన్నికలు రద్దయ్యాయి.
లబోదిబోమంటున్న అభ్యర్థులు
ఎన్నికలు జరిగే 12 జడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలకు 421 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సందిగ్ధత మధ్యనే ఏప్రిల్ 8వతేదీన ఎన్నికలు నిర్వహించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పోలింగ్‌కు నోటిఫికేషనకు మధ్య నాలుగు వారాల గడువు ఉండాలి. ఈ నిబంధన పాటించకుండానే ఏప్రిల్ ఒకటిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా బాఽధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని వారం రోజుల గడువుతో 8న పోలింగ్ నిర్వహించేలా నోటిఫికేషన జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ ఎన్నికలపై సింగిల్ బెంచ స్టే ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం డివిజన బెంచకు అప్పీల్ చేయడంతో అక్కడ గ్రీన సిగ్నల్ వచ్చింది. అయితే.. బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్‌కు ఐదారు రోజుల ముందు నుంచి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు భారీగా నగదు ఖర్చు చేశారు. ఒక్కో ఎంపీటీసీ అభ్యర్థి కనిష్టంగా రూ.2 లక్షలు, గరిష్టంగా రూ.5 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. జడ్పీటీసీ అభ్యర్థులు కొందరు పోటీ తీవ్రతను బట్టి రూ.5లక్షల నుంచి రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశారని రాజకీయ నాయకులే అంటున్నారు. ఎన్నికలు రద్దు కావడం.. మళ్లీ పోలింగ్‌కు సిద్ధం కావాల్సి రావడంతో లబోదిబోమంటున్నారు. ఖర్చు మాటేలా ఉన్నా.. న్యాయస్థానం తీర్పును శిరసావహిస్తామని ఓ రాజకీయ పార్టీ నాయకుడు పేర్కొనడం కొసమెరుపు. అయితే ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉంది.
బరిలో అభ్యర్థులు
------------------------------------------------------
వివరాలు జడ్పీటీసీ ఎంపీటీసీ
------------------------------------------------------
మొత్తం స్థానాలు 50 554
ఎన్నికలు జరిగేవి 12 117
బరిలోఉన్న అభ్యర్థులు 49 372