రైతుల సంక్షేమానికే ఆర్‌బీకేలు

ABN , First Publish Date - 2021-07-09T05:22:31+05:30 IST

రైతుల సంక్షేమానికే రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందనిఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

రైతుల సంక్షేమానికే ఆర్‌బీకేలు
కొత్తపల్లెలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రాచమలు, ఎమ్మెల్సీ రమే్‌షయాదవ్‌

ప్రొద్దుటూరు రూరల్‌, జూలై 8: రైతుల సంక్షేమానికే రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందనిఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా రైతు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, సచివాలయం, హెల్త్‌ సెంటర్లను ఎమ్మెల్సీ ఆర్‌వీఎస్‌ రమే్‌షయాదవ్‌ తో ఎమ్మెల్యే  ప్రారంభించారు.  కార్యక్రమంలో సర్పంచ్‌ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ డీఈ మల్లీశ్వర్‌రెడ్డి, చేనేత కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జింకా విజయలక్ష్మి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 

మైలవరంలో : మండల పరిధిలోని దొమ్మరనంద్యాల గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఎంపీడీవో రామచంద్రారెడ్డి, జమ్మలమడుగు మార్కెట్‌ యార్డు చైర్మన్‌, మండల వ్యవసాయాదికారి సుస్మిత సర్పం చు జ్ఞానమ్మ, ఉప సర్పంచ్‌ ఖాదర్‌, వైసీపీ జిల్లా ప్రదాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, వైసీపీ సుబ్బిరెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, తదితరులు పాల్లొన్నారు.నాయకులు  పాల్లొన్నారు.

ముద్దనూరులో: మండల పరిధి బొందలకుంట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని గురువారం మాజీ ఎంపీపీ మునిరాజారెడ్డి, దేనేపల్లి సర్పంచ్‌ కత్తెం పెద్దక్క ప్రారంభించారు.  కార్యక్రమంలో ఏడీఏ అనిత, ఉద్యానాధికారి సుకుమార్‌రెడ్డి, ఎంపీడీవో రమణరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ శ్రీధర్‌రెడ్డి పాల శ్రీను, జెట్టి ప్రతాప్‌, ఆకుల రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కొండాపురంలో: మండలంలోని 18రైతు భరోసా కేంద్రాలలో రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు మండల వ్యవసాయశాఖ అధికారి జ్ఞానేంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా రేగడిపల్లె, సుగుమంచిపల్లె, ఎర్రగుడి, బెడుదూరు, తిమ్మాపురం గ్రామాలకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ట్రాక్టర్‌ పరికరాలను అందజేసినట్లు తెలిపారు. 

Updated Date - 2021-07-09T05:22:31+05:30 IST