రోడ్లను పరిశీలించిన ఆర్‌అండ్‌బీ చీఫ్‌ సెక్రటరీ

ABN , First Publish Date - 2021-12-09T04:29:36+05:30 IST

వరదల కారణంగా తెగిపోయిన పెనగలూరు చెరువు కట్టను బుధవారం రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు పరిశీలించారు.

రోడ్లను పరిశీలించిన ఆర్‌అండ్‌బీ చీఫ్‌ సెక్రటరీ
చెరువు కట్టపై పడిన గోతులను పరిశీలిస్తున్న కృష్ణబాబు

పెనగలూరు, డిసెంబరు 8 : వరదల కారణంగా తెగిపోయిన పెనగలూరు చెరువు కట్టను బుధవారం రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు పరిశీలించారు. చెరువుకు కట్ట ఎన్నిచోట్ల తెగిపోయింది. జరిగిన నష్టమెంత తదితర వివరాలను ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అధికారులు, ఎంపీడీవోను అడిగి తెలుసుకొన్నారు. ముందుగా రెండు తూముల దగ్గర పడిన పెద్ద గండ్లను చూశారు. అనంతరం అద్దెమ్మతోపు దగ్గర పడిన భారీ గోతిని, బాగా దెబ్బతిన్న కట్టను చూశారు. అక్కడ నిర్మిస్తున్న ర్యాంపును పరిశీలించారు. ర్యాంపుపై బస్సు తిరిగే విధంగా నిర్మించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పల్లంపాడు గ్రామస్థులు తమ పరిస్థితి ఏమిటని అడగగా ఏటిలో నీటి ప్రవాహం తగ్గిన తరువాత పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా కాజ్‌వే నిర్మాణానికి ప్రతిపాదిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-12-09T04:29:36+05:30 IST