రేషన కోత

ABN , First Publish Date - 2021-08-22T05:27:46+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల రేషనకార్డులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల జాబితాను తయారు చేసింది. వాటిని పరిశీలించి సరి చేసేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అడుగు వేస్తోంది.

రేషన కోత

సచివాలయ ఉద్యోగుల కార్డులు కట్‌  

జిల్లాలో 7449 తొలగింపు  

క్రమశిక్షణ చర్యలకు ఊతం  

ఆందోళనలో ఉద్యోగులు


సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులను వీలైనంత వరకు తగ్గించేందుకు జగన సర్కార్‌ ముమ్మర కసరత్తు చేస్తోంది. రకరకాల నిబంధనలను తీసుకువస్తోంది. అయితే ఇప్పుడు రైస్‌ కార్డులపై దృష్టి సారించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల రేషనకార్డులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల జాబితాను తయారు చేసింది. వాటిని పరిశీలించి సరి చేసేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అడుగు వేస్తోంది. పౌర సరఫరాల శాఖ యాక్టు ప్రకారం క్రిమినల్‌ చర్యలు, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వమిచ్చే రూ.15వేల వేతనంపై రైస్‌ కార్డులను కట్‌ చేయడం అన్యాయమంటూ ఉద్యోగులు వాపోతున్నారు. 


కడప, ఆగస్టు 21 (ఆంరఽధజ్యోతి): జిల్లాలో 8,22,500 రైస్‌ కార్డులు ఉన్నాయి. రైస్‌ కార్డుదారులకు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యసేవలు పొందవచ్చు. జగన సీఎం అయిన తరువాత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. సంక్షేమ పథకాలు, ప్రభు త్వ సేవలన్నీ గ్రామస్థాయికే అంటూ ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లాలో 633 గ్రామ, 256 వార్డు సచివాలయాలున్నాయి. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు రేషన కట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 7449 మంది సచివాలయ ఉద్యోగులకు రేషన కార్డులు ఉన్నాయంటూ ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగి పేరు, రేషనకార్డు మండలాల వారీగా వివరాలను క్షేత్ర స్థాయికి పంపించింది. దీనిపై ఎంక్వయిరీ చేయాలని ఆదేశించింది. ఉద్యోగం చేస్తున్నట్లు తేలితే కార్డు కట్‌ అవుతుంది.


15వేలే..

సచివాలయ ఉద్యోగులకు రూ.15వేల వేతనం ఇస్తున్నారు. వారికి ఇప్పటి వరకు ఎలాంటి సర్వీసు రూల్స్‌ లేవు. ఇంకా ప్రొబేషనరీలోనే ఉన్నారు. వీరికి ఉద్యోగం రాకముందే రేషనకార్డులున్నాయి. వీరి కుటుంబంలో అర్హులైన వారు పెన్షన్లు తీసుకుంటున్నారు, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేయించుకుంటున్నారు. అయితే ఇప్పుడు రైస్‌ కార్డు తొలగిస్తే వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలు అందవు. సచివాలయంలో ఉద్యోగం చేస్తున్న వారు రేషనకార్డు నుంచి బయటికి వెళ్లే ఆప్షన లేదు. దీంతో రైస్‌ కార్డు ఇక రద్దే అని ఆందోళన చెందుతున్నారు. సచివాలయ ఉద్యోగి అనారోగ్యానికి గురైతే వైద్య సేవలు చేసిన తరువాత బిల్లులు పెట్టుకోవచ్చు. అసలే చాలీచాలని వేతనంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. రైస్‌కార్డు ఆసరాగా ఉంటుందనుకుంటే అదీ తొలగిస్తున్నారనే ఆందోళనలో ఉన్నారు. ఈ విషయమై ఆంధ్రజ్యోతి డీఎ్‌సవో సౌభాగ్యవతితో మాట్లాడగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగులెవరూ రేషన కార్డు తీసుకోకూడదు. సచివాలయ ఉద్యోగులకు రద్దయ్యే కార్డులపై విచారణ చేపడుతున్నామని తెలిపారు. 

Updated Date - 2021-08-22T05:27:46+05:30 IST