మహిళపై అత్యాచారం - యువకునిపై కేసు
ABN , First Publish Date - 2021-05-22T05:03:44+05:30 IST
కడప నగరానికి చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు రిమ్స్ సీఐ సత్యబాబు తెలిపారు.

కడప (క్రైం), మే 21 : కడప నగరానికి చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు రిమ్స్ సీఐ సత్యబాబు తెలిపారు. సీఐ వివరాల మేరకు.. నిరంజన్‌నగర్‌కు చెందిన శేఖర్ పెయింటర్ పనిచేసకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ రెండురోజుల క్రితం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటికి చెబితే చంపుతానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ యువకునిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.