రాజీవ్‌పార్క్ రోడ్డు రీసర్వే చేయాలి
ABN , First Publish Date - 2021-11-06T05:14:31+05:30 IST
రాజీవ్‌పార్కు రోడ్డు (ట్యాంక్‌బండ్) నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయని, ఈ రోడ్డును రీ సర్వే చేయాలని అఖిలపక్ష పార్టీల, ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బి.నారాయణ (సీపీఎం), వెంకటశివ (సీపీఐ), ఎస్‌ఏ సత్తార్ (కాంగ్రెస్), సగిలి గుర్రప్ప (బీఎస్పీ), సీఆర్‌వీ ప్రసాద్ (హేతువాద సంఘం) నేతలు మాట్లాడారు.

అఖిలపక్ష పార్టీల, ప్రజాసంఘాల నేతల డిమాండ్
కడప(మారుతీనగర్), నవంబరు 5: రాజీవ్‌పార్కు రోడ్డు (ట్యాంక్‌బండ్) నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయని, ఈ రోడ్డును రీ సర్వే చేయాలని అఖిలపక్ష పార్టీల, ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బి.నారాయణ (సీపీఎం), వెంకటశివ (సీపీఐ), ఎస్‌ఏ సత్తార్ (కాంగ్రెస్), సగిలి గుర్రప్ప (బీఎస్పీ), సీఆర్‌వీ ప్రసాద్ (హేతువాద సంఘం) నేతలు మాట్లాడారు. రాజీవ్ పార్క్ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ఇటు ప్రభుత్వం, అటు అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారని, కానీ బాధ్యతాయుతంగా ఉండాల్సిన సర్వేయర్ జోసెఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఒక్కో చోట ఒక్కో రకంగా సర్వే చేశారని, ఇతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంగా జిల్లా అధికారులకు, అధికార పార్టీ జిల్లా ముఖ్య నేతలకు తెలిపినప్పటికీ ఆ సర్వేయర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డు నిర్మాణంలో వాస్తవాలు తెలుసుకొని, అవినీతి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే అందరినీ కలుపుకొని ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో దేవరశ్రీకృష్ణ, (లోక్‌సత్తా పార్టీ), దస్తగిరి (ఎంఆర్‌ఎఫ్) తదితరులు పాల్గొన్నారు.