రాజీవ్‌ గాంధీ రాజనీతిజ్ఞుడు : తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-08-21T04:56:06+05:30 IST

భారతరత్న, దివంగత ప్రధాని, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడి పీసీసీ వ ర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తుల సిరెడ్డి కొనియాడారు.

రాజీవ్‌ గాంధీ రాజనీతిజ్ఞుడు : తులసిరెడ్డి
రాజీవ్‌గాంధీకి నివాళులర్పిస్తున్న తులసిరెడ్డి, కాంగ్రెస్‌ నేతలు

వేంపల్లె, ఆగస్టు 20: భారతరత్న, దివంగత ప్రధాని, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడి పీసీసీ వ ర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తుల సిరెడ్డి కొనియాడారు. శుక్రవారం రాజీవ్‌గాం ధీ 77వ జయంతి సం దర్భంగా నివా ళుల ర్పించిన ఆయన మా ట్లాడుతూ ఐదేళ్లు ప్రధానిగా, ఆరేళ్లు ఏఐసీసీ అధ్యక్షుడిగా అటు దేశా నికి, ఇటు కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో సేవ చేశారన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, బాబు, నరసింహారెడ్డి, ఉత్తన్న, రమ ణ, నాగార్జున, నాగరాజు, బద్రి, రాఘవయ్య, సుబ్బరాయుడు, రామ య్య తదితరులు పాల్గొన్నారు. 

బద్వేలు, ఆగస్టు20: దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, పీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ జె. ప్రభాకర్‌ ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. ప్రధానిగా బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికిఎంతో కృషిచేశారన్నారు.  పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా అభివృ ద్ధి చేశారని వారు ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు దామోదర్‌, అచ్యుతరాజు, ఫైరోజ్‌ బాష, ఖాదర్‌బాష,చంద్ర, మహబూబ్‌ సాహెబ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-21T04:56:06+05:30 IST