రైతు ఉద్యమానికి నిధి సేకరణ
ABN , First Publish Date - 2021-01-04T04:48:20+05:30 IST
ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఉధ్య మానికి చేయూతగా ఉద్యమ నిధిని సేకరించినట్లు ఆ సం ఘం కన్వీనర్ కె.శ్రీనివాసులు పేర్కొన్నారు.
బద్వేలు, జనవరి 3: ఢిల్లీలో రైతులు చేపడుతున్న ఉధ్య మానికి చేయూతగా ఉద్యమ నిధిని సేకరించినట్లు ఆ సం ఘం కన్వీనర్ కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం రైతు వ్యతిరేక నల్లచట్టాలను ఉపసంహరించుకోవాలని ఢిల్లీ రోడ్లపై రైతులు పోరాటం చేస్తున్నా కేంద్రం పట్టించుకోకుం డా రైతులను మోసం చేస్తున్న పద్ధతిని మానుకోవాలన్నారు. సీఐటీయూ నేతలు షేక్ ఖాదర్‌హుసేన, జిల్లా కార్యదర్శి కె.నాగేంద్రబాబు, మస్తాన, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.