వర్షం అంటేనే రైతులకు బెంబేలు

ABN , First Publish Date - 2021-11-29T04:58:59+05:30 IST

వర్షం అంటేనే రైతులు బెంబేలెత్తే పరిస్థితి మండలంలో నెలకొంది. గతంలో కురి సిన వర్షాలకు మండల వ్యాప్తంగా పంటలు తుడుచుకు పెట్టుకుపోయా యి.

వర్షం అంటేనే రైతులకు బెంబేలు
సింహాద్రిపురంలో నల్లగా మారిన శనగ పంట

సింహాద్రిపురం, నవంబరు 28: వర్షం అంటేనే రైతులు  బెంబేలెత్తే పరిస్థితి  మండలంలో నెలకొంది. గతంలో కురి సిన వర్షాలకు మండల వ్యాప్తంగా  పంటలు తుడుచుకు పెట్టుకుపోయా యి. కనీసం భూమిలో తేమ ఆరితే దె బ్బతిన్న పంటల స్థానంలో ప్రత్యా మ్నాయ పంటల సాగుకు రైతులు సిద్దమయ్యే తరుణంలో మళ్లీ వర్షం ఆదివారం మొదలవ్వడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఆదివా రం ఉదయం నుంచి ఎడతెరపి లే కుండా వర్షం కురుస్తూనే ఉంది. ఇప్ప టికే మండల వ్యాప్తంగా 20 వేల ఎక రాల్లో శనగ పంట, 15 వేల 468 ఎక రాల్లో చీనీ, 450 ఎకరాల్లో అరటి, 200 ఎకరాల్లో దనియాలు, 50 ఎకరాల్లో ఉల్లి పంటలు, ఉద్ది, పెసర, పత్తి, పొ ద్దుతిరుగుడు, జొన్న పంటలకు పూర్తి నష్టం వాటిల్లింది. ఈఏడాది కరువు బారిన పడినట్లేనని రైతులు మనోవేద నకు గురవుతున్నారు. పస్తుతం వర్షం ఆగి భూముల్లో తేమ ఆరే లోపు పం టల సాగుకు అదును దాటిపోతుంద ని రైతులు అయోమయంలో పడ్డారు. పంటలు దెబ్బ తిన్న రైతులకు ప్రభు త్వం పరిహారం అందజేసి ఆదుకోవా లని మండల రైతులు కోరారు.

నష్టాల ఊబిలో రైతులు

ఖాజీపేట, నవంబరు 28: తుఫాను ప్రభావంతో పంటలు తుడిచిపెట్టుకు పోగా విద్యుత్తు మోటార్లు సైతం నీటిలో మునిగి అపార నష్టాన్నితెచ్చిపెట్టాయి. వారం రోజుల కిందట కురిసి న వర్షాలకు వాగులు, నదులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి. కొమ్మలూరు, త్రిపురవరం, ఏటూరు, సన్నబల్లె గ్రామాల్లోని పొలాలకు పెన్నా, కుందూ నదులకు బిగించిన విద్యుత్తు మోటార్లు నీటిలో మునిగాయి. ట్రాన్స్‌ఫార్మర్లు సైతం నేలకొరిగాయి. అటు పంటలు, విద్యుత్తు మోటార్లు ధ్వంసం కావడంతో రైతన్నకు అపార నష్టం వాటిల్లింది.



Updated Date - 2021-11-29T04:58:59+05:30 IST