పిల్లలకు నాణ్యమైన భోజనం అందించండి
ABN , First Publish Date - 2021-10-22T04:56:36+05:30 IST
గ్రామీణ అంగన్‌వాడీ సెంటర్లలో చిన్నారుల కు నాణ్యమైన భోజనం అందించాలని మండల ప్రత్యేకాధికారి గణేష్, సర్పంచ్ శ్రీనివాసులు పేర్కొన్నారు.

గోపవరం, అక్టోబరు 21: గ్రామీణ అంగన్‌వాడీ సెంటర్లలో చిన్నారుల కు నాణ్యమైన భోజనం అందించాలని మండల ప్రత్యేకాధికారి గణేష్, సర్పంచ్ శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం కాల్వపల్లె పంచాయ తీ ఉప్పువారిపల్లె అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన వారు మాట్లా డుతూ అంగన్‌వాడీ సెంటర్ల ప్రధాన ఉద్దేశం చిన్నారులకు పౌష్టికాహారం అందించడమేనన్నారు. అంగన్‌వాడీ సెంటర్‌లోని మౌలిక వసతులను పరిశీలించి అవసరాలు తెలిపితే ఏర్పాటు చేస్తామని సర్పంచ్ శ్రీనివాసులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి సచివాలయ పోలీస్, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.