ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించండి

ABN , First Publish Date - 2021-12-08T05:00:21+05:30 IST

ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని ఎపీ ప్రజా ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ ఎంప్లాయిస్‌ యూనిటీ అసోసియేషన్‌ కడప రీజియన్‌ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించండి

కడప (మారుతీనగర్‌), డిసెంబరు 7: ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని ఎపీ ప్రజా ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ ఎంప్లాయిస్‌ యూనిటీ అసోసియేషన్‌ కడప రీజియన్‌ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఏపీ జేసీ అమరావతి అసోసియేషన్‌ పిలుపు మేరకు మంగళవారం స్థానిక కడప డిపోలో ఆర్టీసీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపిందే కానీ ప్రభుత్వ ఉద్యోగులకు అందే సౌకర్యాల మాత్రం ఆర్టీసీ ఉద్యోగులకు అందడం లేదన్నారు. ఆర్టీసీలో ఉద్యోగులకు క్యాడర్‌ ఫిక్సేషన్‌ జరుపకుండా తాత్సారం చేయడం సరికాదన్నారు. కావున క్యాడర్‌ ఫిక్సేషన్‌ త్వరితగతిన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనిటీ అసోసియేషన్‌ రీజనల్‌ కార్యదర్శి ఎ.ఆర్‌.మూర్తి, డిపో నాయకులు రాము, బాలవెంకటేశు, ఎ.ఎ్‌స.రెడ్డి, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T05:00:21+05:30 IST