మెరుగైన సేవలు అందించండి

ABN , First Publish Date - 2021-11-23T05:30:00+05:30 IST

పట్టణంలోని ప్రజలకు మరిం త మెరుగైన సేవలు అందించాలని మున్పిపల్‌ కమిషనర్‌ వెంకటరమణయ్య సూచించారు.

మెరుగైన సేవలు అందించండి

ప్రొద్దుటూరు, నవంబరు 23 : పట్టణంలోని ప్రజలకు మరిం త మెరుగైన సేవలు అందించాలని మున్పిపల్‌ కమిషనర్‌ వెంకటరమణయ్య సూచించారు. స్థానిక మున్పిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం వార్డు ప్లానింగ్‌ సెక్రెటరీలతో ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా వారి అవసరాలను గుర్తించి సత్వరమే పరిష్కరించాలన్నారు. ప్రతి రోజు రెండు గంటల మేర ఫీల్డులో తిరిగి ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు చేపట్టి ఉంటే వెంటనే నోటిసులు జారీ చేసి, వాటి నిర్మాణాలను ఆపి వేయాలన్నారు.  కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ సువర్ణ, పీపీఎస్‌ ఇందిర, టౌన్‌ సర్వేయర్‌ గురుశేఖర్‌, ప్లానింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.  అనంతరం  కమిషనర్‌ను సత్కరించారు. 

Updated Date - 2021-11-23T05:30:00+05:30 IST