పెంచిన జీఎస్టీని తగ్గించాలని నిరసన

ABN , First Publish Date - 2021-12-09T04:25:38+05:30 IST

వస్త్రాలపై 5 శాతం నుంచి 12 శాతం వరకు పెంచిన జీఎస్టీని తగ్గించాలని కోరుతూ వస్త్రభారతి, న్యూవస్త్రభారతి వ్యాపారులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు.

పెంచిన జీఎస్టీని తగ్గించాలని నిరసన
నిరసన వ్యక్తం చేస్తున్న వస్త్ర వ్యాపారులు

ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 8: వస్త్రాలపై 5 శాతం నుంచి 12 శాతం వరకు పెంచిన జీఎస్టీని తగ్గించాలని కోరుతూ వస్త్రభారతి, న్యూవస్త్రభారతి వ్యాపారులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు దుకాణాలను మూసివేసి దుకాణాల సముదాయా ల వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసి జీఎస్టీని తగ్గించాలని నినాదాలు చేశారు. ఈసందర్భంగా వస్త్రభారతి క్లాత్‌మార్కెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మేరువ పెంచలయ్య మాట్లాడుతూ పెంచిన జీఎస్టీ వల్ల కొనుగోలుదారులపై అదనపు భారం పడుతుందని, దీని వల్ల వ్యాపారాలు పడిపోతాయన్నారు. కొవిడ్‌ వల్ల వ్యాపారాలు చాలా వరకు తగ్గిపోయాయని, ఈ సమయంలో జీఎస్టీని పెంచడం దారుణమన్నారు. వివేకానంద, నందిని, బాలాజీ క్లాత్‌ మార్కెట్‌ల వద్ద వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో ఏపీ టెక్స్‌లైల్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లా శేషయ్య, న్యూ వస్త్రభారతి క్లాత్‌ మార్కెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాఘవేంద్రారెడ్డి, వస్త్రభారతి క్లాత్‌ మార్కెట్‌ కార్యదర్శి అనిల్‌కుమార్‌, గుమ్మటమయ్య తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-09T04:25:38+05:30 IST