సీనియర్‌ అసిస్టెంట్లకు ఏవోలుగా పదోన్నతి

ABN , First Publish Date - 2021-07-25T04:39:16+05:30 IST

కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా ప్రజా పరిషత్‌ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఆరుగురికి ఏవోలుగా పదోన్నతి కల్పించారు.

సీనియర్‌ అసిస్టెంట్లకు ఏవోలుగా పదోన్నతి

కడప రూరల్‌, జూలై 24 : కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా ప్రజా పరిషత్‌ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఆరుగురికి ఏవోలుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు శనివారం జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి పోస్టింగ్‌ ఆర్డర్స్‌ను ఇచ్చారు. చిట్వేలి మండలం ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి.నాగభూషణంకు ఆడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీసర్‌ (ఏవో)గా పదోన్నతి కల్పిస్తూ అక్కడే పోస్టింగ్‌ను ఇచ్చారు. పులివెందులలో పనిచేస్తున్న వి.లోకేశ్వరరావును లింగాల మండల పరిషత్‌ కార్యాలయ ఏవోగా, కడప డీఎండబ్ల్యువో కార్యాలయంలో పనిచేస్తున్న జె.ప్రభాకర్‌ను కడప జడ్పీ కార్యాలయ ఏవోగా,  కడపలోని వీఆండ్‌క్యుసి సబ్‌ డివిజన్‌-1లో పనిచేస్తున్న సి.విజయకుమార్‌రెడ్డిని కడప జడ్పీ కార్యాలయానికి, మైదుకూరు పీఆర్‌ఐ సబ్‌ డివిజన్‌లో పనిచేస్తున్న సి.బాలన్నను ప్రొద్దుటూరు మండల పరిషత్‌ కార్యాలయానికి, బి.మఠం మండల పరిషత్‌ కార్యాలయంలో పనిచేస్తున్న టి.శారదను కాశినాయన మండల మండల పరిషత్‌ కార్యాలయ ఏవోగా పోస్టింగ్‌లను ఇచ్చారు. ఈ మేరకు పై అధికారులు శనివారం బాధ్యతలను చేపట్టారు. జిల్లా ప్రజాపరిషత్‌ శాఖలో అన్ని విభాగాల పోస్టులను సీనియారిటీ ప్రకారం ప్రభుత్వ నిబంధనలను అనుసరించి  పారదర్శకంగా చేపట్టామని జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-07-25T04:39:16+05:30 IST