పుట్టగొడుగుల పెంపకంతో లాభం

ABN , First Publish Date - 2021-07-24T05:33:42+05:30 IST

పుట్టగొడుగుల పెంపకం ఎంతో లాభదాయకమని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్‌ వీరయ్య తెలిపారు. వ్యవసాయ అభివృద్ధితో యువత ప్రాముఖ్యతను గుర్తించి అఖిలభారత వ్యవసాయ మండలి వ్యవసాయంలో గ్రామీణ యువతను ఆకర్షించడం, నిలుపుకోవడం అనే పథకాన్ని స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ప్రారంభించారు.

పుట్టగొడుగుల పెంపకంతో లాభం

సీకేదిన్నె, జూలై 23: పుట్టగొడుగుల పెంపకం ఎంతో లాభదాయకమని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్‌ వీరయ్య తెలిపారు. వ్యవసాయ అభివృద్ధితో యువత ప్రాముఖ్యతను గుర్తించి అఖిలభారత వ్యవసాయ మండలి వ్యవసాయంలో గ్రామీణ యువతను ఆకర్షించడం, నిలుపుకోవడం అనే పథకాన్ని స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత వ్యవసాయంవైపు ఆసక్తి, నమ్మకం పెంచుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా మలుచుకునే అవకాశాలను వారికి తెలియజేయడం జరుగుతుందన్నారు. ఏరువాక కేంద్రం సమన్వయకర్త పద్మోదయ మాట్లాడుతూ చిరుధాన్యాలతో తయారైన ఆహార ఉత్పత్తులు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ఆహారం కచ్చితంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు రామలక్ష్మిదేవి, శ్రీనివాసులు, నాగిరెడ్డి, శిల్పకళ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T05:33:42+05:30 IST