ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వ పరిధిలోకి తేవాలి

ABN , First Publish Date - 2021-05-21T04:41:39+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను ప్రభు త్వ పరిధిలోకి తీసుకురావాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎ్‌సయూ) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న డిమాండ్‌ చేశారు.

ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వ పరిధిలోకి తేవాలి

లక్కిరెడ్డిపల్లె, మే20 : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను ప్రభు త్వ పరిధిలోకి తీసుకురావాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎ్‌సయూ) రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న డిమాండ్‌ చేశారు. గురువారం దప్పేపల్లె పంచాయతీ జాండ్రపల్లెలో వారు మాట్లాడుతూ ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సదుపాయాలు లేక అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలే దీనికి ప్రధాన కారణమన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన కనీస ప్రాథమిక బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని ఈసందర్భంగా పేర్కొన్నారు.

Updated Date - 2021-05-21T04:41:39+05:30 IST