గుండెపోటుతో ఖైదీ మృతి
ABN , First Publish Date - 2021-10-22T04:52:12+05:30 IST
కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించినట్లు రిమ్స్ పోలీసులు తెలిపారు.
కడప (క్రైం), అక్టోబరు 21: కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో మరణించినట్లు రిమ్స్ పోలీసులు తెలిపారు. కడప బెల్లంమండీవీధికి చెందిన షేక్ ఇక్బాల్ హుస్సేన్ (47), వరకట్న వేధింపుల కేసులో 4 సంవత్సరాలు జైలు శిక్ష పడడంతో 2019 సెప్టెంబరు నెల నుంచి కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఛాతిలో నొప్పి ఉండడంతో వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్‌కు తరలించకగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.