మత్స్యసహకార సంఘం జిల్లా అధ్యక్షుడిగా మల్లే నారాయణస్వామి

ABN , First Publish Date - 2021-12-07T05:31:57+05:30 IST

మత్స్యసహకార సంఘం జిల్లా అధ్యక్షుడిగా మల్లే నారాయణస్వామి

మత్స్యసహకార సంఘం జిల్లా అధ్యక్షుడిగా మల్లే నారాయణస్వామి

చెన్నూరు, డిసెంబరు 6 : చెన్నూరు బెస్తకాలనీకి చెందిన మల్లే నారాయణస్వామిని జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడిగా నియమించారు. ఉపాధ్యక్షుడిగా చామంతి శివశంకర్‌, డైరెక్టర్లుగా పెద్ద ఎరుకలయ్య, బోలాసుబ్బరాయుడు, చిన్న నర్సయ్య, వర్దిబోయిన రమణయ్య, జింకా వెంకటసుబ్బయ్య, శివశంకర్‌నాయుడు, గొడుగు రమణయ్యలను ఏకగీవ్రంగా ఎంపిక చేశారు. ఎన్నికల అధికారి మోహన్‌కృష్ణ వారికి నియామక పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ మత్స్యసహకార సంఘంలో ఉన్న సభ్యులు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించి సంఘం అభివృద్ధికి తోడ్పతానని పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-07T05:31:57+05:30 IST