కషాయంతో వైరస్‌ నివారణ

ABN , First Publish Date - 2021-10-22T04:55:45+05:30 IST

కషా యంతో పంటలకు సోకే వైరస్‌ను నివా రించవచ్చని పులివెం దుల డివిజన్‌ ప్రకృతి వ్యవసాయ మాస్టర్‌ ట్రైనర్‌ మస్తాన్‌ పేర్కొ న్నారు.

కషాయంతో వైరస్‌ నివారణ
టమోటా పంటకు సోకిన వైరస్‌ను పరిశీలిస్తున్న మాస్టర్‌ ట్రైనర్‌ మస్తాన్‌

పులివెందుల రూరల్‌, అక్టోబరు 21: కషా యంతో పంటలకు సోకే వైరస్‌ను నివా రించవచ్చని పులివెం దుల డివిజన్‌ ప్రకృతి వ్యవసాయ మాస్టర్‌ ట్రైనర్‌ మస్తాన్‌ పేర్కొ న్నారు. నల్లపురెడ్డిపల్లె లో టమోటా పంటకు సోకిన వైరస్‌ను పరిశీ లించారు. అకాల వ ర్షాల కారణంగా ట మోటా పంటకు వైర స్‌ సోకే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.

ప్రకృతి వ్యవసాయ పద్దతి లో పచ్చిపేడ, పసుపు ద్రావణం, కలబంద, ఉమ్మెత్త ఆకు కషాయం వాడి ఈ వైరస్‌ను నివారించవచ్చన్నారు. పచ్చి పేడ, పసుపు ద్రావ ణం ఆంటీబయోటిక్‌గా, కలబంద, ఉమ్మెత్త ఆకు కషాయం వైరస్‌ నివారణకు పనిచేస్తుందని వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటల సాగు ఎంతో లాభదాయకమని, ఆరోగ్యకరమైన పంటలు పండించవచ్చని తెలిపారు. 

Updated Date - 2021-10-22T04:55:45+05:30 IST