ఉప ఎన్నికలకు రంగం సిద్ధం
ABN , First Publish Date - 2021-10-30T05:01:48+05:30 IST
మండలంలో శనివారం జరిగే ఎన్నికలపై అధికారులు రంగం సిద్ధం చేశారు. మండల ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు.

పోరుమామిళ్ల, అక్టోబరు 29: మండలంలో శనివారం జరిగే ఎన్నికలపై అధికారులు రంగం సిద్ధం చేశారు. మండల ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు. పోరుమామిళ్ల మండల ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా కడప కార్పొరేషన్ కమిషనర్ రంగస్వామిని ప్రత్యేకంగా నియమించారు. పోలింగ్ కేం ద్రాల వద్ద రెవెన్యూ అధికారుల విధి విధానాల గురించి సూచనలు ఇచ్చారు.
శుక్రవారం వర్షం కురవడంతో చాలా పోలింగ్ కేంద్రాల వద్ద వర్షపు నీరు చేరి బురదమయమైంది. రెవెన్యూ అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. పోలీస్ అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుని పోలింగ్ కేంద్రాల వద్ద పర్యవేక్షిస్తున్నారు.
స్వేచ్ఛగా ఓటు వేయండి
ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓట్లు వేసుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ అన్బురాజన్ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆయన పోలీసు అధికారులకు సలహాలు, సూచలు ఇచ్చారు. వారితో మాట్లాడుతూ ఎన్నికల ప్ర శాంత వాతావరణానికి ఎవరైనా భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తేలేదన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
303 మందితో బందోబస్తు
డీఎస్పీ వాసుదేవన్
కాశినాయన అక్టోబరు29: మండలం లో ప్రతి ఓటరు ప్రశాంత వాతా వరణంలో ఓటు వేయాలని డీఎ్‌సపీ వాసుదేవన్, సీఐ మోహన్‌రెడ్డ్డి కోరారు. మం డలంలోని 29 పోలింగ్ కేంద్రాల్లో 150 మం ది కేంద్రబలగాలు, 130 మంది రాష్ట్ర పోలీసులు, 15 మంది ఎస్‌ఐలు, 6 మంది సీఐలు, ఇద్దరు డీఎ్‌సపీలు ఉంటారన్నారు. ప్రతి ఓట రూ స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవచ్చన్నారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.