నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ABN , First Publish Date - 2021-07-09T05:13:38+05:30 IST
అత్యవసర మరమ్మతులు, నిర్వహణ నేపథ్యంలో నేడు (శుక్రవారం) ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు నగరంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీరు ఎన్.శ్రీనివాసులు పేర్కొన్నారు.

కడప(సిటీ), జూలై 8: అత్యవసర మరమ్మతులు, నిర్వహణ నేపథ్యంలో నేడు (శుక్రవారం) ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు నగరంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీరు ఎన్.శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రకాశ్‌నగర్, ఎర్రముక్కపల్లె, ఇండస్ట్రియల్ ఎస్టేట్, హౌసింగ్ బోర్డు కాలనీ, అరవింద్‌నగర్, పటేల్ రోడ్డులలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.