పోలీసు సంక్షేమానికి పెద్దపీట

ABN , First Publish Date - 2021-12-31T05:17:05+05:30 IST

పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు సిబ్బందికి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ పేర్కొన్నారు. గురువారం నగరంలోని పోలీస్‌ పెరేడ్‌ మైదానానికి ఎదురుగా మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులకు ప్రత్యేకంగా విశ్రాంతి భవనం ఏర్పాటు చేశారు.

పోలీసు సంక్షేమానికి పెద్దపీట
విశ్రాంతి భవనాన్ని ప్రారంభిస్తున్న ఎస్పీ

కడప(క్రైం), డిసెంబరు 30: పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు సిబ్బందికి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ పేర్కొన్నారు. గురువారం నగరంలోని పోలీస్‌ పెరేడ్‌ మైదానానికి ఎదురుగా మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులకు ప్రత్యేకంగా విశ్రాంతి భవనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విధుల నిమిత్తం వచ్చే వారికి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా విశ్రాంతి భవనంలో, ఆర్‌ఎ్‌సఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) ఎం.దేవప్రసాద్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ మహే్‌షకుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య, ఆర్‌ఐలు మహబూబ్‌బాషా, జార్జ్‌, వీరేష్‌, సోమశేఖర్‌నాయక్‌, ఆర్‌ఎ్‌సఐలు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్‌, గౌరవాధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


రక్తదానం ప్రాణదానంతో సమానం 

రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ పేర్కొన్నారు. నగరంలోని ఉమే్‌షచంద్ర స్మారక కళ్యాణ మండపంలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-12-31T05:17:05+05:30 IST