శాంతిభద్రతల అదుపులో పోలీసుల సేవలే కీలకం
ABN , First Publish Date - 2021-01-21T05:05:09+05:30 IST
శాంతిభద్రతల అదుపులో పోలీసుల సేవలే కీలకమని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు.

కొండాపురం, జనవరి 20: శాంతిభద్రతల అదుపులో పోలీసుల సేవలే కీలకమని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తాళ్లప్రొద్దుటూరు ఆర్‌అండ్‌ఆర్ సెం టర్‌లో నూతనంగా నిర్మించిన తాత్కాలిక పోలీ్‌సస్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసుల సేవలు మరువలేవన్నారు. తాత్కాలికంగా నెలరోజుల వ్యవధిలోనే ఆర్‌అండ్‌ఆర్ సెంటర్‌లో పోలీ్‌సస్టేషన్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో ఓఎస్డీ దేవప్రసాద్, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, తాళ్లప్రొద్దుటూరు, కొండాపురం ఎస్‌ఐలు విద్యాసాగర్, మంజునాథ, జమ్మలమడుగు పరిధిలోని పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.